విషజ్వరాలపై అప్రమత్తం

27 Mar, 2023 00:40 IST|Sakshi
ఎమ్మెల్యే ఆళ్ల నానికి పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఎంహెచ్‌ఓ ఆశ

ఏలూరు టౌన్‌: జిల్లావ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని, వాతావరణంలో మార్పుల దృష్ట్యా విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందనీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ బి.ఆశ ఆదివారం శ్రీరామ్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే నానిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం చాలా ప్రయోజనకరంగా ఉందని అన్నారు. 108 జిల్లా మేనేజర్‌ గణేష్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు