పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Published Tue, Dec 12 2023 1:04 AM

విజేతలకు బహుమతులు అందిస్తున్న కలెక్టర్‌    - Sakshi

నూజివీడు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటం మన జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మూడు ప్రదేశాలను పూర్తి చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా నగరవనాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఏలూరు, నూజివీడులో ఇప్పటికే నగరవనాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులంతా ఉల్లాసంగా గడిపారు. జేసీ బి.లావణ్య వేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజీంద్రన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర దామా, సామజిక వనాల అధికారి హిమ శైలజ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement