మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పతకాల పంట | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పతకాల పంట

Published Tue, Dec 12 2023 1:04 AM

రాష్ట్ర స్థ్దాయి మాస్టర్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు 
 - Sakshi

ఏలూరు రూరల్‌: రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాస్టర్స్‌ పతకాల పంట పండించారు. 30 ఏళ్ల వయస్సు విభాగం నుంచి 70 ప్లస్‌ వయస్సు వరకూ పోటీ పడి ప్రత్యర్థులను చిత్తు చేసి 40 మెడల్స్‌ చేజిక్కించుకున్నారు. ఇందులో 20 గోల్డ్‌ మెడల్స్‌, 16 సిల్వర్‌, మరో 4 బ్రాంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాస్టర్స్‌ అద్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బీడీ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 10 వరకూ చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీతో పాటు తారకరామ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 42వ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 75 ప్లస్‌ వయస్సు విభాగంలో ఎం.నరసింహరాజు 100, 200, 400, 4 గీ 400 మీటర్ల పరుగు పందెంలో 4 గోల్డ్‌ మెడల్స్‌, 4 గీ 100 పరుగు పోటీలో ఒక సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడు. ఇదే విభాగంలో ఇంటి కృష్ణమోహనరావు హైజంప్‌లో గోల్డ్‌, 100, 800 మీటర్ల పరుగులో సిల్వర్‌, బ్రాంజ్‌ గెలుపొందారు. 70 ప్లస్‌లో ఎం.యోహాన్‌ షాట్‌పుట్‌, హేమర్‌త్రోలో 2 బ్రాంజ్‌మెడల్స్‌ చేజిక్కించుకున్నారు. 65 ప్లస్‌లో బీడీ నాగేశ్వరరావు హేమర్‌త్రో అంశంలో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. 60 ఏళ్ల విభాగంలో సుంకర యాకోబు 800, 1400, 4 గీ 400, మూడు బంగారు పతకాలు, 5 కి.మీ పరుగు, 4 గీ 100 మీటర్ల పరుగులో 2 సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. మహిళలు 70 ప్లస్‌ విభాగంలో కె.శాంతకుమారి షాట్‌పుట్‌, డిస్కస్‌, జావలిన్‌త్రోలో 3 సిల్వర్‌ మెడల్స్‌ సాదించారు. మరోపక్క పి.పద్మ జయలక్ష్మీ 40 ప్లస్‌ విభాగంలో పోటీపడి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌లో 3 బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఇదే క్రమంలో పి.రమేష్‌రాజు, పి.సుబ్బరాజు, జె.గోపాలకృష్ణ, వి.సుబ్బరాజు, వై.అశోక్‌కుమార్‌, ఎస్‌.సూర్యనారాయణ పలు విభాగాల్లో పోటీ పడి పతకాలు సాధించారని వివరించారు.

అథ్లెటిక్స్‌లో మండపాక పీడీకి మూడు బంగారు పతకాలు

తణుకు అర్బన్‌: మండపాక జెడ్పీ హైస్కూల్‌ పీడీ సంకు సూర్యనారాయణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన 42వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో 5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 5 కిలో మీటర్లు వాకింగ్‌ పోటీల్లో పాల్గొని మూడు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించినట్లు సూర్యనారాయణ సోమవారం స్థానిక విలేకరులకు చెప్పారు. ఈ విజయాలతో వచ్చే ఏడాది జనవరిలో పూణేలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను తణుకు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.

తిరుపతిలో మాస్టర్స్‌ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

40 పతకాలు సాధించిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

బంగారు పతకాలతో
పీడీ సూర్యనారాయణ
1/1

బంగారు పతకాలతో పీడీ సూర్యనారాయణ

Advertisement
Advertisement