మలేషియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ‘విష్ణు’ విద్యార్థినికి కాంస్యం | Sakshi
Sakshi News home page

మలేషియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ‘విష్ణు’ విద్యార్థినికి కాంస్యం

Published Tue, Dec 12 2023 1:04 AM

పిల్లి వందన - Sakshi

భీమవరం: మలేషి యాలో సోమవారం జరిగిన ఏషియా క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2023 పోటీల్లో 84 కిలోల సబ్‌ జూనియర్‌ విభాగంలో స్థానిక విష్ణు ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని పిల్లి వందన తృతీయస్థానం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జి శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌తోపాటు వందన స్క్వాట్‌లో వెండి పతకం, బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌ లిఫ్ట్‌లో కాంస్య పతకం సాధించి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్‌ గెలిచిన వందనను ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాసరాజు తదితరులు అభినందించారు.

కళాశాల బస్సు ఢీకొని

గేదెల కాపరి దుర్మరణం

అత్తిలి: గేదెలను మేత కోసం తోలుకునివెళుతుండగా ప్రైవేట్‌ కళాశాల బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఓ కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. అత్తిలి ఎస్సై వి.రాంబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన బుంగా రామకృష్ణ (35) సోమవారం ఉదయం తణుకు వైపునకు గేదెలను మేత కోసం తోలువెళుతుండగా, అత్తిలి నుంచి తణుకు వెళుతున్న కళాశాల బస్సు అతివేగంగా వెనుక నుంచి రామకృష్ణను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే రామకృష్ణ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.

13న త్రోబాల్‌ ఎంపిక పోటీలు

తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ఈ నెల 13న త్రో బాల్‌ జూనియర్స్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు సీహెచ్‌ఏఆర్‌కే వర్మ, సెక్రటరీ ఎన్‌.ఎం.శ్రీనాఽథ్‌ సోమవారం చెప్పారు. ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌, పుట్టిన తేదీలకు ఒరిజినల్‌, జిరాక్స్‌ పత్రాలను, ఎనిమిది పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. ప్రతిభ కనపర్చిన వారిని ఈ నెల 16, 17 తేదీలలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement