OTT Releases: ఓటీటీలో ఏకంగా 28 సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

2 Nov, 2023 16:08 IST|Sakshi

చాలామంది వీకెండ్‌లో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూసి కాల‌క్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్ష‌న్ మ‌రొక‌టి లేద‌నే చెప్పాలి. అటు ఒక వారంలో థియేట‌ర్‌లో ఎన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయో అంత‌కు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి.

క్రైమ్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, కామెడీ.. ఇలా అన్ని జాన‌ర్ల కంటెంట్ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది. మ‌రి ఈ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ‌వుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న‌ సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వ‌చ్చాయ‌ని అర్థం.

అమెజాన్ ప్రైమ్ వీడియో

► త‌కేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది
► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్‌ 3
► ర‌త్తం - న‌వంబ‌ర్ 3
► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్‌ 3

హాట్‌స్టార్‌
► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
► కాఫీ విత్ క‌ర‌ణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది
► లోకి రెండో సీజ‌న్‌, ఐద‌వ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది
► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్‌ 3

నెట్‌ఫ్లిక్స్‌
► జ‌వాన్ - స్ట్రీమింగ్ అవుతోంది.
► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది.
► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.

► మ్యాడ్ - న‌వంబ‌ర్ 3
► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) -  న‌వంబ‌ర్ 3

► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► స్లై (ఇంగ్లీష్ మూవీ) -  న‌వంబ‌ర్ 3
► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3

సోనీలివ్‌
► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్‌ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3

బుక్ మై షో
► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్‌ 3
► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్‌ 3
► ద థీఫ్‌ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్‌ 3

ఆపిల్ ప్లస్ టీవీ
► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) -  న‌వంబ‌ర్ 3

జియో సినిమా
► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3

చ‌ద‌వండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్!

మరిన్ని వార్తలు