లండన్‌ వీధుల్లో లెహెంగాతో హల్‌చల్‌ చేసిన మహిళ!

12 Feb, 2024 09:44 IST|Sakshi

మన దేశంలో అమ్మాయిలు చీరకట్టులో లేదా లెహెంగాలో కనిపించని అంత స్పెషల్‌గా ఏం ఉండదు. బహుశా ఈ రోజు ఏదైనా పండుగ లేదా వేడుక అయ్యి ఉండొచ్చు అనే అనుకుంటారు. అదే విదేశాల్లో మన దేశీ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో హల్‌చల్‌ చేస్తే..పరిస్థితి ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా అందరీ ముఖాల్లో వివిధ రకాల ఎక్స్‌ప్రెషన్‌లు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్టన్నింగ్‌ లుక్స్‌తో ఒక్కసారిగా అటెన్షన్‌ అయ్యిపోతారు. అలానే ఇక్కడొక మహిళ లెహంగాతో లండన్‌ వీధుల్లో షికారు చేసింది. అంతే వారి అటెన్షన్‌ అంతా ఆమెపైనే నిలిపి నోరెళ్లబెట్టి  చూస్తుండిపోయారు. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో శ్రద్ధ అనే భారత సంతతి స్పానిష్‌ మోడల్‌ ఎరుపు రంగు ఎంబ్రాయిడర్‌తో కూడిన లెహెంగా ధరించి, నిండుగా ఆభరణాలతో ధగ ధగ మెరిసిపోయింది. లండన్‌లోని మెట్రో రైలు ఎక్కగానే అందరి చూపు ఆమెపైనే ఉంది. ఇక ఆమె తన గమ్యాన్ని చేరుకుని, అక్కడ వీధుల్లో కాసేపు షికారు చేసింది.

అయితే అక్కడ ఉన్న కొందరూ ఆమె చిత్రాలను క్లిక్‌మనిపించగా కొందరూ ఆసక్తికరమైన రీతీలో ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారు. ఈ మేరకు శ్రద్ధ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేస్తూ..ఈ వీడియోకి 'లండన్‌ దేశీ టాప్‌ అండ్‌ స్కర్ట్‌కి వచ్చిన విశేష స్పందన' అనే క్యాప్షన్‌ ఇచ్చి మరీ పోస్ట్‌ చేసింది. అయితే నెటిజన్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం మీరు అని మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

A post shared by Shraddha✨ (@shr9ddha)

(చదవండి: ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega