Sabudana Health Benefits: సత్తువ పెంచే సగ్గుబియ్యం

14 May, 2022 15:41 IST|Sakshi

సగ్గుబియ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. పండగ ఏదైనా దీనితో తయారు చేసిన వంటకం కచ్చితంగా ఉండాల్సిందే.. వీటిని కర్ర పెండలం దుంపతో తయారు చేస్తారు. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి.. ప్రతిరోజు రెండు స్పూన్ల సగ్గుబియ్యం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ తింటారు. వీటిని తినడం వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగవచ్చు. లేదంటే పాలు, బెల్లం, సగ్గుబియ్యం కలిపి పాయసం తయారు చేసుకుని తినవచ్చు.. ప్రతిరోజు వీటిని తినటం వలన ఎముకల కండరాలు దృఢంగా తయారవుతాయి. 

అలసట, నీరసం, నిస్సత్తువ ఉన్న వారు వీటిని తీసుకుంటే తక్షణ శక్తి చేకూరుతుంది ఇందులో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి వీటిని చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సగ్గుబియ్యాన్ని ఉప్మా, కట్‌లేట్‌ గా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇందులో స్టార్చ్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ అదుపులోకి వస్తాయి. సగ్గుబియ్యంలో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి ఉంటాయి. వీటిని గర్భిణులు తింటే వారి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పిండం సక్రమంగా ఎదుగుతుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సగ్గుబియ్యంలో ఐరన్, క్యాల్షియం, విటమిన్‌ కె ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును, రక్తస్రావాన్నీ నియంత్రిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. 

  •  అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  •  రక్తహీనతతో బాధపడే వారు సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయట పడతారు.
  •  సగ్గుబియ్యం తోపాటు బియ్యం కూడా కలిపి వండుకుని తింటే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది.
  •  సగ్గుబియ్యం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు  తెలుసుకున్నారు కదా.. మీరు కూడా తిని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. 
మరిన్ని వార్తలు