స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం!బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!

10 Aug, 2023 14:30 IST|Sakshi

1942 ఆగస్టు 9న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో లేవనెత్తిన 'డూ ఆర్‌ డై అనే నినాదమేస క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాంది. ఇదే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో ఒ‍కటిగా పేరుగాంచింది. దీనినే భారత్ చోరో ఆందోళన అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమే భారత స్త్రీ ఆవేశాన్ని వెలకితీసింది. ఆ ఉద్యమంలో వారేమీ సంప్రదాయ ముసుగులో మగ్గిపోతున్న వంటింటి కుందేళ్లు గాదని అవసరమైతే దేశం కోసం చీరను నడుముకి బిగించి కథన రంగంలోకి దిగే అపర కాళీశక్తులని ఎలుగెత్తి చెప్పారు.

బ్రిటిషర్ల గుండెల్లో భయాన్ని పుట్టించారు. భారత స్త్రీ అంటే ఏంటో చూపించారు. వారి ధైర్యసాహసాలు, అపార త్యాగనిరతితో కరడుగట్టిన బ్రిటిషర్ల మనసులనే కదిలించారు. చివరికి నారీమణుల ధీ శక్తికి తెల్లవాళ్లే తలవంచి నమస్కరించి "జయహో భారత్‌" అనేలా చేసింది. పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ధీరవనితలు గురించి తెలుసుకుందామా!

బహుశా ఆమే తొలి రేడియో జాకీ..!
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 22 ఏళ్ల విద్యార్థిని ఉషా మెహతా. ఆమె తన గాత్రంతో నాటి ఉద్యమ పరిస్థితులను వివరిస్తూ బ్రిటిషర్లను గడగడలాడించింది. ఆమె బహుశా బారతదేశపు తొలి రేడియో జాకీ కావచ్చు. మెహతా ఎంత ధైర్యవంతురాలు అంటే భూగర్భ రేడియో స్టేషన్‌ ద్వారా ఉద్యమాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను గురించి దేశాన్ని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేసేది. వార్తా సంస్థలను అణివేసే వార్తలన్నింటిని ధైర్యంగా ప్రసారం చేసేది.

పోలీసుల కళ్లుగప్పి రహస్యంగా సేవలందించేది. తన ఉనికిని కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ.. వివిధ ప్రదేశాల్లోని స్టేషన్లలో దేశభక్తి గీతాలతోపాటు మనోహర్‌ లోహియా వంటి విప్లవకారుల ప్రసంగాలను ప్రసారం చేసింది. ఈ రేడియో స్టేషన్‌ ఆగస్టు 27, 1942న 41.72 మీటర్ల బ్యాండ్‌తో ప్రారంభమయ్యింది. ఇది మార్చి6, 1943 వరకు కొనసాగింది. ఇది చివరిసారిగా జనవరి 26, 1944న ప్రసారమయ్యింది. గాత్రంతో కూడా దేశాన్ని రక్షించుకుంటూ వలసవాదుల గుండెల్లో గుబులు తెప్పించొచ్చు అని రుజువు చేసిన ఘట్టం. 

గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ 
అరుణ్‌ అసఫ్‌ అలీని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా పిలుస్తారు. అరుణా అసఫ్ అలీ 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో త్రివర్ణ భారత జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న తరుణంలో అరుణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లి మరీ స్వాతంత్ర పోరాటం కోసం చేస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహించింది. అలాగే ఈ ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం తెప్పించేలా భూగర్భ రేడియో స్టేషన్, ఇంక్విలాబ్' అనే పత్రికల  సాయంతో ప్రచారం చేసింది.

ఆమె క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. 1932లో, తీహార్ జైలులోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఆమె నిరాహారదీక్ష చేసింది. ఆ ఉపవాస ఫలితంగా ఆమె శరీరంలలో ఒక్కసారిగా జీవక్రియ స్థాయిలు పడిపోయి పరిస్థితి విషమించి మరణించింది అరుణ్‌ అసఫ్‌ అలీ. ఈ ఘటన కొంతమంది బ్రిటిషర్లను కదిలించడమే గాక భారత స్త్రీలు సహనమే ఆభరణంగా చేసుకుని పోరాడగలరనే విషయాన్ని గుర్తించారు. 

నెత్తురొడ్డుతున్న లెక్కచేయని తెగువ..
వృద్ధారాలు సైతం దేశం కోసం పరాక్రమంతో పోరాడగలదని చెప్పిన ఘట్టం. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకు చెందిన మాతంగిని హజ్రా అనే 73 ఏళ్ల మహిళ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అంతగా తెలియని, గుర్తించని నాయకురాళ్లో ఒకరామె. సెప్టంబర్‌ 29న 6 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులను తమ్లుక్ పోలీస్ స్టేషన్‌ను దోచుకున్నారు. ఆసమయంలో కాల్పులు జరగగా..ఆమె బుల్లెట్ల బారినపడ్డప్పటికీ తలెత్తి వందేమాతరం అంటూ జెండాపట్టుకుని మరీ ఊరేగింపులో కొనసాగింది. నెత్తురొడ్డుతున్న లెక్కచేయలేదు. వందేమాతరం అంటూ కన్నుమూసింది. చివరి శ్వాసవరకు దేశం కోసం పోరాడటం అంటే ఏంటో చాటి చెప్పింది హజ్ర. ప్రజల్ని కదిలించిన గొప్ప ఘట్టం అది.

మీ డ్యూటీ మీరు చేయండి!
అస్సాంలోని గోహ్‌పూర్‌ నివాసి కనకలత బారువా. ఆమె 17 ఏళ్ల వయసులో 5 వేల మంది సైన్యానికి నాయకత్వం వహించి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఆ పోలీస్టేషన్‌కి ఇన్‌చార్జ్‌గా ఉన్న నాటి ఆఫీసర్‌ రెబాతి మహన్‌ సోమ్‌ దీన్ని ఆపమని బారువాను అభ్యర్థించినా వినలేదు. పైగా మీరు మీ డ్యూటీ చేయండి నేను నా పని చేస్తానని తెగేసి చెప్పింది. ఏ మాత్ర భయం లేకుండా తన పాదయాత్రను కొనసాగించింది. దీంతో పోలీసులు చేసేదేమి లేక ఆమెపై కాల్పలు జరిపారు. ఆ ఫైరింగ్‌ కారణంగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘట్టం ఒక స్త్రీలోని దాగున్న తెగువతో కూడిన ఆవేశాన్ని తెలియజేసింది. ఈ ఘటన ఒకరకంగా బ్రిటిషర్లను మదిలో భయాందోళలనలను రేకెత్తించిందనే చెప్పాలి. 

రెండు నెలల పాపతో పోరాటంలోకి దిగిన ఓ తల్లి
కేరళలోని అత్యంత ప్రసిద్ధ చెందిన స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు కుట్టిమలు అమ్మ. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులలో ఒకరు. స్థానిక మహిళలతో బ్రిటిష్ సైనికులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే కథనాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం ఆమె మాతృభూమి పత్రికను నిషేధించింది.

ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమ్మ మహిళల ఊరేగింపుకు నాయకత్వం వహించింది. ఆమెతో పాటు రెండు నెలల పాప కూడా ఉంది. వెంటనే నాటి బ్రిటిష్‌ ఆఫీసర్లు ఆమెను బిడ్డతో సహా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. అంతేగాదు ఆమె భారత స్వాతంత్య్ర పోరాటాలన్నింటిల్లో చురుగ్గా పాల్గొంది. రెండు సార్లు జైలు పాలైంది కూడా. ఆమె విడుదలైన తదనంతరమే కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది కూడా. 1985లో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచింది. 

(చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్‌ బాధితులకు ఉపాధిగా..!)

మరిన్ని వార్తలు