బుజ్జి పాపాయిల కోసం.. వాళ్లకు నచ్చే విధంగా రుచికరమైన ఆహారం

30 Sep, 2023 17:03 IST|Sakshi

ఇప్పుడిప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లిబుజ్జాయిలకి.. ఈ ప్యూరీ బ్లెండర్‌ బేబీ ఫుడ్‌ సప్లిమెంట్‌ మెషిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.  ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు నచ్చేవిధంగా.. మృదువుగా, రుచికరంగా ఆహారాన్ని ఉడికించి, పేస్ట్‌ చేస్తుంది. సాధారణంగా ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్‌ వంటి పోషకాహారాలను కుక్‌ చేసి.. మెత్తగా క్రీమ్‌లా చేయడం చాలా సమయంతోనూ శ్రమతోనూ కూడిన పని. కానీ ఈ ఆటోమేటిక్‌ స్టీమింగ్‌ అండ్‌ బ్లెండింగ్‌ మేకర్‌ కొన్ని నిమిషాల్లోనే వేడివేడిగా ఆ క్రీమ్‌ని అందిస్తుంది.

నాలుగు హైక్వాలిటీ  బ్లేడ్స్‌తో వేగంగా పనిచేస్తుంది. ఈ మెషిన్స్‌లో చాలా రంగులు, మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో చికెన్, ఫిష్‌ కూడా ఉడికించుకోవచ్చు. ముందుగా ఎడమవైపున్న వాటర్‌ ట్యాంక్‌లో వాటర్‌ నింపుకుని.. కుడివైపున ఆహారాన్ని వేసుకుని.. ఆప్షన్స్‌ సెట్‌ చేసుకోవచ్చు. వాటర్‌ ట్యాంక్‌ మూత పక్కనే.. డిస్‌ప్లేలో ఆప్షన్స్‌ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. 

మరిన్ని వార్తలు