Kullu Trout Fish: ఘుమఘుమలాడే కులు ట్రౌట్‌ ఫిష్‌ తయారీ ఇలా!

11 Jun, 2022 14:30 IST|Sakshi

కులు ట్రౌట్‌ ఫిష్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ స్పెషల్‌ వంటకం కులు ట్రౌట్‌ ఫిష్‌ ఓసారి ట్రై చేయండి.

కులు ట్రౌట్‌ ఫిష్‌ తయారీకి కావలసినవి:
ట్రౌట్‌ చేపలు – రెండు
కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు
నిమ్మరసం – మూడు టేబుల్‌ స్పూన్లు
మెంతి ఆకులు – రెండు టీస్పూన్లు
బరక మిరపపొడి – అరటీస్పూను

ఉల్లిపాయ తరుగు – అరకప్పు
ధనియాలు – రెండు టీస్పూన్లు
నిమ్మతొక్క తరుగు – టీస్పూను
ఆవనూనె – అరకప్పు
ఉప్పు – రుచికి సరిపడా.

కులు ట్రౌట్‌ ఫిష్‌ తయారీ..
ట్రౌట్‌ చేపలను శుభ్రంగా కడగాలి.
కడిగిన చేపలకు మధ్యలో గాట్లు పెట్లాలి
ధనియాలను దంచుకుని చేపలపై వేయాలి.
వీటితో పాటు మెంతి ఆకులు, బరక మిరపపొడి, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మతొక్క తరుగు, ఆవనూనె కొద్దిగా వేసి చేపలకు పట్టేలా అప్లై చేయాలి.
దీనిని పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి
నానిన ఫిష్‌ను గ్రీల్‌ లేదా డీప్‌ ఫ్రై చేసుకోవాలి
ఇప్పుడు మిగతా ఆవనూనెను బాణలిలో వేసి వేడెక్కనివ్వాలి.
కాగిన నూనెలో ఉల్లిపాయ తరుగు, ఆవాలు వేసి వేయించాలి.
ఉల్లిపాయ రంగు మారాక స్టవ్‌ ఆపేసి నిమ్మరసం, కొత్తిమీర  తరుగు వేసి చక్కగా కలపాలి
ఈ తాలింపు మిశ్రమాన్ని డీప్‌ఫ్రై చేసిన చేపలపై వేసి సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Babru And Tudkiya Bhath: గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు, ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్‌ ఇలా!
Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా

మరిన్ని వార్తలు