చిన్నారుల్లో వచ్చే ఆటిజం, హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌కి ప్లాస్టిక్‌ కారణమా!

10 Oct, 2023 17:30 IST|Sakshi

ప్లాస్టిక్‌ వల్ల చాలా దుష్పరిణామాలు ఉ‍న్నాయని విన్నాం. కానీ దీని వల్లే పుట్టే పిల్లలకు ఇంత ప్రమాదం అని ఊహించి కూడా ఉండం. మన కంటి పాపల్లాంటి చిన్నారుల జీవితాలను ప్లాస్టిక్‌ పెనుభూతం చిదిమేసి మన జీవితాలను కల్లోలంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్‌ మన నిత్య జీవితంలో తెలియకుండానే ఒక భాగమైంది. మన నిర్లక్ష్యమో మరే ఏదైనా కారణమో గానీ జరగకూడని నష్టమే వాటిల్లుతోందని తాజా పరిశోధనల్లోషాకింగ్‌ విషయాలే వెల్లడయ్యాయి.

చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిటీ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ)కి ప్లాస్టిక్‌ కారకాలే కారణమని యూఎస్‌ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో ఆటిజం, పిల్లల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది కూడా. సమాజంలో ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కారణంగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలిసిందే. తాజా అధ్యయనంలో "బిస్‌ ఫినాల్‌ ఏ(బీపీఏ)" అనే ప్లాస్టిక​ కారణంగానే పిల్లలు ఇలాంటి రుగ్మతలు బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని ప్లాస్టిక్‌ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినియోగిస్తారు. యూఎస్‌లోని రోవాన్‌ విశ్వవిద్యాలయం శాస్రవేత్తలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సముహంపై గ్లుకురోనిడేషన్‌ అనే ప్రకియను నిర్వహించారు. అంటే..మూత్రం ద్వారా శరీరంలో చెడు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ.

ఈ ప్రకియలో ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌(ఏఎస్‌డీ)తో బాధపడుతున్న చిన్నారుల, అటెన్షన్‌ డెఫిసిటీ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్న పిల్లలు శరీరం నుంచి ప్లాస్టిక్‌కి సంబంధించిన మరో రూపాంతరం అయినా డై ఈథైల్‌ ఆక్సిల్‌ పాథాలేట్‌ను బయటకు పంపించే సామర్థ్యం లేనట్లు గుర్తించారు. ఈ "బిస్‌​ ఫినాల్‌ ఏ" "ప్లాస్టిక్‌​, డై ఈథైల్‌ ఆక్సిల్‌ పాథాలేట్‌(డీఈహెచ్‌పీ)" ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఈ రుగ్మతతో ఉన్న పిల్లల శరీరాని వాటిని బయటకు పంపించే సామర్థ్యం ఉండదని తేలింది. వారి కణాజాలల్లో ఈ రెండు ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉండిపోతాయని పేర్కొన్నారు.

ఆటిజం పిల్లలు ఈ ప్లాస్టిక్‌కి సంబంధించిన టాక్సిన్‌లను కేవలం 11 శాతం, ఏడీహెచ్‌డీ బాధపడుతున్న చిన్నార్లుల్లో 17 శాతం శరీరం నుంచి బయటకు పంపించగల సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఆ ప్లాస్టిక్‌ సంబంధించిన మిగతా టాక్సిన్‌లన్నీ వారి శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండిపోవడాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది న్యూరాన్‌ అభివృద్ధిని పూర్తిగా నష్టపరుస్తోందని అన్నారు. ఈ రెండు డిజార్డ్‌ర్లు, జన్యుపరమైన పర్యావరణ ప్రభావాల కలయికతోనే వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడించారు. అలా అని న్యూరో డెవలప్‌మెంట్‌ డిజార్డర్‌ ఉన్న ప్రతి బిడ్డ బీపీఏ ప్లాస్టిక్‌ని తొలగించడంలో సమస్యలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం అని చెప్పారు.

దీంతో కొన్ని ఇతర అంశాలు కూడా ముడిపెట్టి ఉంటాయన్నారు. వాస్తవంగా ఇది గర్భాశయంలోంచే చిన్నారుల్లో ఈ న్యూరో డెవలప్‌మెంట్‌ సమస్య వస్తుందా లేక జన్మించాక అనేది తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మాత్రం న్యూరో డెవలప్‌మెంట్‌ డిజార్డర్స్‌కి ప్లాస్టిక్‌కి సంబంధించిన పర్యావరణ కాలుష్య కారకాలతో పూర్తిగా సంబంధం ఉందని రుజువైంది. ఆ న్యూరో డెవలప్‌మెంట్‌ డిజార్డర్‌కి ఎంతమేర ప్లాస్టిక్‌ కారణమనేది అంచనా వేయడం అంత అజీ కాదన్నారు. 

(చదవండి: షుగర్‌ ఉంటే పెడిక్యూర్‌ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..)

మరిన్ని వార్తలు