దిల్‌ ‘మ్యాంగో’మోర్‌... సమ్మర్‌ ఎండ్‌ పికిల్స్‌ ట్రెండ్‌

21 Jun, 2022 18:30 IST|Sakshi

భిన్న రకాల ఆవకాయ పచ్చళ్లకు ఊపు

వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్‌లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు...

► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది.  
► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని  విషయం. 

► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. 
► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్‌ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్‌ .
► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి  మరింతగా నిల్వ ఉంటుంది.
► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. 
► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా  ఈ సీజన్‌ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా.  భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన  చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్‌డ్రాప్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు