Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రావట..!

18 Nov, 2021 12:54 IST|Sakshi

Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్‌ చేయడం కూడా ఓ రకమైన స్టంట్‌ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉ‍ల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్‌ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్‌! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం..

గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత!

చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్‌ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..

నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్‌ కేక్‌ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే..

‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్‌ స్కిన్‌ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్‌ రిప్లై ఇచ్చాడు.

‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్‌.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు?

చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!

A post shared by Sideserf Cake Studio (@sideserfcakes)

మరిన్ని వార్తలు