షుగర్‌ ఉంటే పెడిక్యూర్‌ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

10 Oct, 2023 12:29 IST|Sakshi

షుగర్‌ ఉన్నవాళ్లు కళ్లు దగ్గర నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవాన్ని కాపాడుకోవాల్సిందే. మధుమేహం అందరికీ కామన్‌ వ్యాధిలా అనిపించినా అదొక సైలెంట్‌ కిల్లర్‌. నెమ్మదిగా అవయవాలన్నింటిని బలహీనం చేసి చావు అంచులదాక తీసుకువెళ్లే భయానక వ్యాధి. సకాలంలో మందులు వేసుకుంటూ జాగురుకతతో వ్యవహరించకపోతే అంతే సంగతి. ఇప్పుడూ షుగర్‌ వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. ఇలా మధుమేహంతో బాధపడేవాళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు పెడిక్యూర్‌ వంటివి చేయించుకోవద్దని స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

మధుమేహగ్రస్తులు ప్రతి అవయవాన్ని చాలా సున్నితంగా చూసుకోవాల్సిందే. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిలు సమంగా ఉండాలి. కళ్లు, మూత్రపిండాలు, గుండె మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడూ చెకప్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల పాదాల్లో నరాలు సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా చాలామందికి పాదాల్లో తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

కాబట్టి వీళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు సంబంధించిన పెడిక్యూర్‌ వంటివి చేయించుకోకూడదు. ఎందుకంటే? వాళ్లు పాదాలల్లో ఉన్న డెడ్‌ స్కిన్‌ని తొలగించడం వంటివి చేస్తారు. ఇది మరింత ప్రమాదం. వాళ్లు చేసే మసాజ్‌ కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మాములు వ్యక్తులకు ఏం కాదు. కానీ ఘుగర్‌ ఉన్నవాళ్లకి అరికాళ్ల వద్ద చర్మ పలుచబడిపోతుంది. కాబట్టి పార్లర్‌ లేదా సెలూన్‌లో పాదాలకు సంబందించిన మసాజ్‌లు కాస్త ప్రమాదమే.

 ఎందుకు పెడక్యూర్‌ వద్దు..?

  • డయాబెటిస్‌ స్టేజ్‌ల రీత్యా వారు ఈ పెడిక్యూర్‌ చేయించుకుంటే అరికాళ్లలోని స్కిన్‌ని తొలగించడం కారణంగా గాయాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటే గాయం అయినా కూడా తెలియదు. మరింత పెద్దిగా మారి ప్రాణాంతకంగా మారవచ్చు.
  • నిజానికి మసాజ్‌ చేసినప్పుడూ రక్తప్రసరణ జరిగి చేయించుకన్న అనుభూతి, రిలీఫ్‌ ఉంటాయి. మధుమేహం ఎక్కువగా ఉంటే ఏం చేసినా అంతగా తెలియదు. 
  • పెడిక్యూర్‌లో భాగంగా గోళ్లు కత్తిరంచడం లేదా క్లీన్‌ చేయడం జరుగుతుంది. ఒకరికి ఉపయోగించిన సాధనాలను అపరిశుభ్రంగా వాడితే అది ఇన్ఫెక్షన్‌లకు దారితీయొచ్చు. 
  • మధుమేహగ్రస్తులు పాదాలకు సంబంధించిన చికిత్సలు ఆర్థోపెడిస్ట్‌ నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇలా సెలూన్‌ లేదా బ్యూటీపార్లర్‌లో చేయించుకుంటే మాత్రం ఇన్ఫెక్షన్ల బారిన పడటమే కాకుండా మరింతగ ఆయా ప్రాంతాల్లో స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

(చదవండి: మానసిక అనారోగ్యమే అని లైట్‌ తీసుకోవద్దు! బీ కేర్‌ ఫుల్‌! లేదంటే..)
 

మరిన్ని వార్తలు