పాదచారుల భద్రతకు.....

26 May, 2023 04:54 IST|Sakshi

పాదచారుల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఉప్పల్‌లో రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆకాశమార్గం నడక వంతెన తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్కలేటర్ల బిగింపులో అధికారులు నిమగ్నమయ్యారు. అతి త్వరలోనే మంత్రి కేటీఆర్‌ దీనికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, కార్పొరేటర్‌ మందముల రజిత పరమేశ్వర్‌రెడ్డి అధికారులతో కలిసి స్కైవాక్‌ వంతెన పనులను పరిశీలించారు. స్కైవాక్‌ వంతెన నిర్మాణానికి దాదాపు 1000 టన్నుల స్టీల్‌ వినియోగించారు. స్టెప్స్‌ వద్ద పచ్చని చెట్లతో గ్రీనరీ. దాదాపు 45 శాతం వరకు పైకప్పుతో కవర్‌. వంతెనపై తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పెయింటింగ్‌ వేశారు. వంతెనపై నడక మార్గంలో కూర్చునేందుకు వీలుగా బెంచ్‌లను ఏర్పాటు చేశారు. స్వతహాగా వెలుగునిచ్చే లైట్స్‌ ఉన్నాయి. – ఉప్పల్‌

మరిన్ని వార్తలు