ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్‌... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు

3 Jun, 2022 11:01 IST|Sakshi

Biden asked How Much More Carnage: టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన మారణహోమం మరువుక మునుపే సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో ఒక దుండగుడు కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇంకా  ఇలాంటి ఎన్ని మారణహోమాలను చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమెరికాలో తుపాకీలను నిషేధించాలంటూ పిలుపు నివ్వడమే కాకుండా ఈ తుపాకీ హింస పై తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్ట సభ సభ్యులను కోరారు. అంతేకాదు కఠినతరమైన తుపాకీ చట్టాలను తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కూడా.

ఐతే అందుకు రిపబ్లికన్‌ సెనెటర్లలోని మెజారిటీ  సభ్యలు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బైడైన్‌ యూఎస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక కాల్పులను చూస్తున్నప్పటికీ ఈ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి ముందకు రాలేకపోతున్నారంటే మీకు మనస్సాక్షి అనేదే లేదంటూ ఆక్రోశించారు. కనీసం పాఠశాలల్లో, ఆసుపత్రులలో హింసాత్మక చర్యలు జరగకుండా ఉండేలా ఆయుధాలను కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని చట్టసభ సభ్యులను కోరారు. గత రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తూ చనిపోతున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది కంటే చిన్నారులే ఈ తుపాకీలకు బలవుతున్నారని ఆవేదనగా చెప్పారు.

ఆయుధాలను సురక్షింతంగా ఉంచడం తప్పనిసరి చేస్తూ...హింసాత్మక నేరాలు జరుగతున్నప్పుడు ఆ తుపాకీలను రూపొందించిన తయారీదారులను సైతం ఈ నేరాలకు బాద్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులను కోరారు. అంతేకాదు ప్రొటెక్టింగ్ అవర్ కిడ్స్ యాక్ట్"ను ఆమోదించాలని, తుపాకీలను కొనుగోలు చేసే వయసు కూడా పెంచాలని నొక్కిచెప్పారు. ఐతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఆత్మరక్షణ కోసం తుపాకీలు వాడకాన్ని అనుమతించాలని, స్కూళ్లలల్లో ఇలాంటి హింసాత్మక కాల్పుల జరగకుండా గట్టి భద్రత కోసం కృషి చేయాలని చెబుతుండటం గమనార్హం.
(చదవండి: అఫ్గన్‌ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు)

మరిన్ని వార్తలు