బ్రిటన్‌ రాణి సమాధి ఫోటోలు వైరల్‌

25 Sep, 2022 10:32 IST|Sakshi

లండన్‌: క్విన్‌ ఎలిజబెత్‌ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు ఆమెతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ భావోద్వేగం చెందారు. ఆమెకు అంతిమ వీడ్కోలు ఇచ్చేందుకు ప్రపంచ దిగ్గజ నాయకులు కదలి వచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. యావత్తు బ్రిటన్‌ దేశం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికింది.

ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ క్వీన్‌ ఎలిజబెత్ సమాధి ఫోటోలను విడుదల చేసింది. ఆమె సమాధిని కింగ్‌ జార్జ్‌ 6 మెమోరియల్‌ చాపెల్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం సమాధిని బెల్జియన్‌ బ్లాక్‌ స్టోన్‌ రూపొందించిన లెడ్జర్‌ స్టోన్‌తో నిర్మించారు. అలాగే ఆ సమాధిపై బ్రిటన్‌ రాణి పేరు, ఆమె భర్త ఫిలిప్‌ తోపాటు, రాణి తల్లిదండ్రుల పేర్లను కూడా లిఖించారు.

అంతేగాదు కింగ్‌ జార్జ్‌ 6 ఎవరో కాదు బ్రిటన్‌ రాణి తండ్రే. ఆయన విశ్రాంతి సమాధి వద్ద ఆమె సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 1962లో ఈ మెమోరియల్‌ చాపెల్‌లోనే జార్జ్‌ 6 సమాధి ఏర్పాటు చేశారు. క్వీన్‌ ఎలిజబెత్‌ సెప్టెంబర్‌ 8న 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె తన ముత్తాతను వెనక్కినెట్టి 70 ఏ‍ళ్లపాటు సుదీర్ఘకాలం పాలించిన బ్రిటన్‌ రాణీగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దివగంత బ్రిటన్‌ రాణి పెద్ద కుమారుడు కింగ్‌ చార్లెస్‌ 3 బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు చేపట్టారు.

(చదవండి: ఉక్రెయిన్‌కి హ్యాండ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌...షాక్‌లో జెలెన్‌ స్కీ)

మరిన్ని వార్తలు