-

China: చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో

12 May, 2022 11:51 IST|Sakshi

బీజింగ్‌: చైనాలోని సౌత్‌వెస్ట్‌ నగరం చాంగ్‌కింగ్‌ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ‍ప్రకారం.. టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని సౌత్‌వెస్ట్‌ చాంగ్‌కింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గురువారం ఉదయం టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళ్లాల్సి ఉంది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్‌ గుర్తించారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకుని వెంటనే ల్యాండ్‌ చేశారు. కానీ విమానం ల్యాండింగ్‌ చేసిన తరువాత అది కంట్రోల్‌ తప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. దీంతో పాటు విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది అందులోని ప్రయాణికులని, సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడగా అస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
 


 

చదవండి: Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం

మరిన్ని వార్తలు