కరోనా భయంతో స్వీట్‌ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు

14 Jun, 2021 14:22 IST|Sakshi

కరోనా ప్రభావమో.. మరేమో కానీ.. ఈ మధ్య జరిగిన చాలా వివాహాలలో ఏదో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంటుంది. దీంతో ఈ పెళ్లిళ్లు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కూడా అలాంటి కోవకు చెందినదే. ఈ వివాహాంలో వరుడు, వధువు ఇద్దరు స్టేజీమీద నిల్చోని ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఈ  వేడుకలో యువతి స్నేహితులు, ఒక ప్లేట్‌లో స్వీట్‌ బాక్స్‌ ఉంచి స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వీట్‌ బాక్స్‌ను వధువుకు ఇచ్చి  వరుడికి తినిపించాలని కోరారు.

ఈ క్రమంలో, ఆ వధువు ఆ బాక్స్‌లోని ఒక స్వీట్‌ను తీసుకుని వరుడికి తినిపించేందుకు చేయి చాచింది. అయితే, పాపం.. ఆ వరుడు ఏ ఆలోచనలో ఉన్నాడో, లేక కరోనా వేళ స్వీట్‌ గోల ఏంటని గాబరా పడ్డాడో గానీ.. నోరు తెరవడానికి కాస్త ఆలస్యం చేశాడు. దీంతో ఆ వధువుకి చిర్రెత్తినట్టుంది. దీంతో వెంటనే తన చేతిలోని స్వీట్‌ను కోపంతో నేలపై పడేసింది. అయితే, ఈ అనుకోని సంఘటనతో, ఆ పెళ్లి కొడుకుకి ఏంచేయాలో అర్థంకాక.. బిత్తర ముఖం వేసుకొని అలాగే ఉండి పోయాడు. 

ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో మాత్రం  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆ యువతికి పెళ్లి ఇష్టం లేదేమో..’, ‘ అందరి ముందు ఇంత కోపం పనికి రాదు..’, ‘నీ కోపంతో స్వీట్‌ను నేల పాలు చేశావ్‌ కదా.. ’ ‘ బాబీ.. కూల్‌.. చల్లబడండి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  అయితే, గతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో సదరు  వధువు..  వరుడి ముఖంపై పువ్వులను విసిరి కొట్టిన ఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

చదవండి: వరుడికి బంపరాఫర్‌.. స్టేజిమీదే  ముద్దు పెట్టిన మరదలు

మరిన్ని వార్తలు