Tussia-Ukraine War: రష్యాలో ఊహించని ఘటన.. పుతిన్‌కు మరో షాక్‌.. వీడియో వైరల్‌

5 Mar, 2022 11:46 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వార్‌ కారణంగా పుతిన్‌కు స్వదేశంలో మరోసారి నిరసన తగిలింది. రష్యాకు చెందిన TV Rain టీవీ చానల్ సిబ్బంది లైవ్‌లో మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. 

వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ ఆ దేశానికి చెందిన టీవీ రెయిన్‌ చానల్‌ సిబ్బంది రాజీనామా చేశారు. ఓ వైపు లైవ్‌లో న్యూస్‌ రన్‌ అవుతుండగానే వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చానల్‌ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో టీవీ ప్రసారాలు చేసి రాజీనామాలు అందించారు. వారి నిర్ణయాన్ని సంస్థ యాజమాన్యం సైతం మద్దతు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అంతకు ముందు ‘టీవీ రెయిన్’ చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం యుద్ధాన్ని ప్రసారం చేసేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ చానల్ ప్రసారాలను రష్యా ప్రభుత్వం నిలిపివేసింది.

మరోవైపు.. ఛానెల్ ఫౌండర్స్‌లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయారని అన్నారు.     అనంతరం తమ చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.  


 

మరిన్ని వార్తలు