ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయిన రూ.4 కోట్ల కారు

11 Aug, 2021 19:49 IST|Sakshi

ప్రముఖ లగ్జరీ ఫెరారీ రోమా వి8 సూపర్ కారు డ్రైవర్ చేసిన నిర్వహకం వల్ల అది ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయింది. ఆ కారు తాను హీరో అనుకున్నడెమో సినిమాలో చూపించినట్లు సందులో నుంచి రూ.4 కోట్ల విలువైన కారును తీసుకోని వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే, అది అనుకోకుండా ఆ సందులో ఇరుక్కొని పోయింది. చివరకు ఆ కారును ఆ సందులో నుంచి తీసుకోని వచ్చాడా? లేదా అనేది అస్పష్టంగా ఉంది. యూట్యూబ్ వీడియోలో మాత్రం డ్రైవర్ ఇరుకైనా సందు నుంచి సూపర్ కారును బయటకు తీయడానికి చాలా కష్టపడటం మనం చూడవచ్చు.

ఫెరారీ రోమా ఏమి చిన్న కారు కాదు. ఇది 183.3 అంగుళాల పొడవు, 77.7 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ సూపర్ కారు బరువు 1,472 కిలోలు.  రూ.4 కోట్ల విలువైన కారు సందులో ఇరుక్కొని పోవడం వల్ల దానికి ఎంతో కొంత నష్టం వాటిల్లింది అనే విషయం వీడియోలో చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఫెరారీ రోమాలో 4.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5,750 - 7,500 ఆర్ పీఎమ్ వద్ద 603 బిహెచ్ పీ పవర్, 3,000 - 5,750 ఆర్ పీఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారు 3.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫెరారీ రోమా కారును ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేశారు. దీని ధర మన దేశంలో రూ.3.76 కోట్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 
 

మరిన్ని వార్తలు