గాజా వీధుల్లో హమాస్‌ అగ్రనేత 

23 May, 2021 01:39 IST|Sakshi

గాజా సిటీ: కాల్పుల విరమణ నేపథ్యంలో హమాస్‌ అగ్రనేత యాహియా సిన్వర్‌ గాజాలో బహిరంగంగా కనిపించారు. సిన్వర్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ బాంబు దాడులు కూడా చేసింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య 11 రోజుల పాటు తీవ్రదాడులు జరిగిన సంగతి తెలిసిందే.

కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ దాడులు ప్రస్తుతం ఆగాయి. ఈ నేపథ్యంలో మరణించిన ఓ కమాండర్‌కు నివాళులు అర్పించేందుకు సిన్వర్‌ బయటకువచ్చారు. కమాండర్‌ ఇంటికి వెళ్లి మరీ నివాళులు అర్పించారు. ఈ నెల ప్రారంభంలో దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఆయన బయట కనిపించడం ఇది మొదటిసారి. 

చదవండి: (రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు