చిరుత వర్సెస్‌ మొసలి.. పైచేయి ఎవరిది?

26 Dec, 2020 13:35 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుత పులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది. అలాగే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బలం అధికంగా ఉంటుంది. మరి అలాంటి మెసలి,‌ చిరుతకు మధ్య పోరు జరిగితే ఎలా ఉంటుంది. చిరుత వర్సెస్‌ మొసలి ఆహారపు వేటలో చివరకు పై చేయి మొసలిదే అయ్యింది. చిరుత ఓడి మొసలి ఆకలికి ఆహారంగా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేకుంది. ఈ భయంకర వీడియోను దక్షిణాఫ్రికా వైల్డ్‌ ఎర్త్‌ సఫారి గైడ్‌ బుసాని మ్థాలీ.. అండ్‌ బియాండ్‌ ఫిండా ప్రైవేట్‌ గేమ్‌ రిజర్వ్‌ వద్ద తీశారు. చదవండి: జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్‌

ఈ వీడియోలో దాహంతో చిరుత నీటిని తాగేందుకు సమీపంలోని ఓ నీటి కుంట వద్దకు వచ్చింది. అయితే అప్పటికే ఆ నీటి లోపల 13 అడుగుల పొడవైన నైలు మొసలి దాక్కొని ఉంది. దానిని గమనించని చిరుత నీటిని తాగుతుండగా ఒక్కసారిగా మొసలి బయటకి వచ్చి తన నోటితో చిరుత మెడను కరుచుకొని ఆమాంతం నీటిలోకి లాక్కెళ్లింది. కొన్ని క్షణాల్లోనే చిరుత మొసలి మెరుపు దాడికి బలైంది. చూడటానికి భయంకరంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. కాగా ఆఫ్రికా ఖండంలో నైల్‌ మొసళ్లను అతి పెద్ద మొసలి జాతిగా పరిగణిస్తారు.  చాలా శక్తివంతమైన కాటుతో వీటి దాడి భయంకరంగా ఉంటుంది. చదవండి: పాపం.. మొసలి అతని సరదా తీర్చేసింది

మరిన్ని వార్తలు