ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ హాస్పిటల్స్‌ సీఈఓగా మేఘనా పండిట్‌

19 Feb, 2023 06:19 IST|Sakshi

లండన్‌:  బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌–ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్‌ మేఘనా పండిట్‌ నియమితులయ్యారు. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్‌ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు.

భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ హాస్పిటల్స్‌ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్‌ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా,  ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్టులో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా, వార్విక్‌ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు.

మరిన్ని వార్తలు