సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్‌ శాస్త్రవేత్తలు

6 Mar, 2022 13:32 IST|Sakshi

మత్స్య కన్య మమ్మీలు!

మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్‌లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్‌గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్‌ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు.

వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు.

ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను  ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది.

జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్‌ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు.

(చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!)

మరిన్ని వార్తలు