అక్కడ మాత్రం రాక్షసుడే : జెఫ్‌ బెజోస్‌పై ప్రియురాలి వ్యాఖ్యలు

2 Dec, 2023 17:32 IST|Sakshi

ప్రపంచ రెండో అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌పై అతని కాబోయే  భార్య లారెన్ శాంచెజ్ కీలక వ్యాఖ్యలు  చేసింది. ఇటీవల ఘనంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా  శాంచెజ్ బెజోస్‌ ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడింది.

వోగ్‌తో మాట్లాడిన శాంచెస్‌ తరచూ తామిద్దరం కలిసే ఈ జంట తరచుగా కలిసి వ్యాయామం చేస్తామని చెప్పింది. అయితే రోజువారి రొటీన్‌ లైఫ్‌ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందని కానీ దాన్ని గోప్యంగా ఉంచడమే తనకిష్టమని వెల్లడించింది. జిమ్‌లో ఇద్దరమూ ఒకే తరహా ఎక్స్‌ర్‌సైజ్‌ చేయలేం.. కానీ తనతో పోలిస్తే బెజోస్‌ పూర్తిగా భిన్నం.. ఒక విధంగా చెప్పాలంటే జిమ్‌లో  రాక్షసుడే అంటూ  కాబోయే భర్త ఫిట్‌నెస్ కమిట్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించింది. 

ఫిట్‌నెస్‌  ఫ్రీక్‌గా జెఫ్ బెజోస్
అమెజాన్ సీఈవోగా తప్పుకున్నప్పటినుంచి బెజోస్‌ ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిపెట్టాడు. వ్యాయాయంతోపాటు, ఆహారంపై కూడా శ్రద్ధ ఎక్కువే. కొవ్వు, మాంసకృత్తులలో కూడిన బలమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ముఖ్యంగా ప్రతీరాత్రి ఎనిమిది గంటల నిద్రే తన సక్సెస్‌కు కారణమని గతంలోనే చెప్పాడు బెజోస్‌. అంతేకాదు ఫిట్‌నెస్ కోసం స్టెరాయిడ్స్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తాడనే వాదనలను  కూడా ఖండించాడు  జెఫ్‌ బెజోస్‌.  59 ఏళ్ల లేటు వయసులో గర్ల్‌ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌ను త్వరలోనే పెళ్లాడనున్నాడు. 
 

మరిన్ని వార్తలు