చైనాకు మరో పెద్ద దెబ్బ

4 Sep, 2020 16:55 IST|Sakshi

చైనానుంచి  తరలిపోనున్న  జపాన్ ఉత్పత్తిదారులు

చైనా నుంచి వెనక్కి వచ్చే తయారీదారులకు  జపాన్ సబ్సిడీలు

ఇండియా,  బంగ్లాదేశ్ లలో తయారీ ప్లాంట్లు ఏర్పాటకు ప్రోత్సాహకాలు 

టోక్యో : అమెరికా, ఇండియా నుంచి వరుస షాక్ లతో సతమవుతున్న చైనాకు వాణిజ్యపరంగా మరో దెబ్బ పడింది. జపాన్ తయారుదారుల పెట్టుబడులు చైనా నుంచి వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దమవుతోంది. తమ యూనిట్లను చైనానుంచి ఇతర ఆసియా దేశాలకు తరలించే తమ దేశ ఉత్పత్తిదారులకు బ్సిడీలను ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ తయారీదారులు చైనా నుండి ఉత్పత్తిని భారతదేశం లేదా బంగ్లాదేశ్ కు మార్చినట్లయితే సబ్సిడీలకు అర్హులని ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. (చైనాకు ఇస్కాన్ షాక్)

జపాన్ వాణిజ్య విస్తరణ కార్యక్రమం ద్వారా దేశ సరఫరాలను నిర్దిష్ట ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించాలని, సబ్సిడీ కార్యక్రమం పరిధిని విస్తరించడం ద్వారా వైవిధ్యంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలకు ఉత్పత్తిని తరలించే సంస్థలకు 2020 ఆర్థిక సంవత్సరానికి జపాన్ అనుబంధ బడ్జెట్ 23.5 బిలియన్ యెన్లను కేటాయించింది. ప్రధానంగా అత్యవసర పరిస్థితులలో కూడా వైద్య సామగ్రి, ఎలక్ట్రానిక్ భాగాల స్థిరమైన సరఫరాను  అందించే వ్యవస్థను నిర్మించాలని భావిస్తోంది. 

జపాన్ నుంచి ప్రామాణిక పెట్టుబడుదారులనుంచి నమ్మకమైన భాగస్వాములకోసం చూస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. జపాన్, భారతదేశం వాణిజ్య వ్యాపార సంబంధాలను విస్తరించడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. అలాగే దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 13వ జపాన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అస్సాంలో ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర ఒక సమావేశంలో తెలిపారు. 
  
జపాన్ కంపెనీల సరఫరా గొలుసు చైనాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది నిలిచిపోయింది.  దీంతో మొదటి దశలో వియత్నాం  లావోస్‌లలో హోయా ఎలక్ట్రానిక్ భాగాల ప్రాజెక్టు తయారీ సహా 30 తయారీ సంబంధిత ప్రాజెక్టులను జపాన్ ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం10 బిలియన్ యెన్లకు సబ్సిడీలను అందించింది. ఈ క్రమంలోనే తరువాతి ప్రణాళికలను కూడా తయారు చేస్తోంది. 
  

>
మరిన్ని వార్తలు