దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా

8 Jul, 2021 13:16 IST|Sakshi
దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు

అబుదాబి: దుబాయ్‌లో బుధవారం అర్థరాత్రి దాటాకా భారీ పేలుడు సంభవించింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా భారీ శబ్ధాలతో హడలెత్తినపోయారంటే పేలుడు తీవ్రత ఏం రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు