కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!

21 May, 2021 11:58 IST|Sakshi

ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు సమానమే. కానీ, ఆడా-మగా తేడాతో ప్రేమను కురిపించే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. పిల్లల్ని పెంచే పద్ధతిలోనూ లింగ వివక్ష చూపించే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి ఓ తండ్రిని జనాలు ‘ఛీ’  కొట్టిన ఘటన ఒకటి జరిగింది.  ప్రముఖ వెబ్‌సైట్‌ రెడ్డిట్‌లోని ఒక ఫోరమ్‌లో కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి ఇలా పోస్ట్ చేశాడు. ‘‘నా వయసు యాభై ఏళ్లు. నా భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. నాకు పదిహేడేళ్ల కొడుకు, పదిహేనేళ్ల కూతురు ఉన్నారు. వాళ్లిద్దరి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నాది. నా కొడుక్కి కావాల్సినంత డబ్బు ఇస్తాను. కానీ, నా కూతురికి మాత్రం ఇవ్వదల్చుకోలేదు.

కారణం, శానిటరీ ప్యాడ్స్‌, పీరియడ్‌ ప్రొడక్టుల కోసం ఆమె విపరీతంగా ఖర్చుచేస్తోంది. అందుకే ఆ ఖర్చు కోసం ఆమెనే డబ్బు సంపాదించి నాకివ్వమని చెప్పా. అందుకోసం నాలుగు ఇళ్లలో పని చేయమని సలహా ఇచ్చాను. కానీ నా కూతురికి అది నచ్చలేదు. వెంటనే బ్యాగ్ సర్దేసుకుని నా సోదరి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి పంపించమని నా సోదరిని అడిగితే.. ఆమె నన్ను బండబూతులు తిట్టింది. ఇందులో ఏమైనా తప్పుందా?’’ అని నెటిజన్స్‌ను అడిగాడు. 

అంతే.. ఆ పోస్టుకి ఇప్పుడు వేల మంది రియాక్ట్ అయ్యారు. ఆ తండ్రిని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. సెక్సీయెస్ట్‌ ఎబ్యూజింగ్‌ కేస్‌ కింద ఆ తండ్రిని జైల్‌లో వేయాలని కొందరు పోలీసులను కోరారు. అలాంటి తండ్రి దగ్గర ఉండే కంటే.. దూరంగా ఎక్కడైనా ప్రశాంతంగా బతకమని ఆ కూతురికి సలహా ఇచ్చారు మరికొందరు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు