పాక్‌ ప్రధాని అవస్థలు.. పుతిన్‌ నవ్వులు.. సొంత దేశంలో ట్రోలింగ్‌పర్వం

16 Sep, 2022 12:06 IST|Sakshi

వైరల్‌: పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌​ షరీఫ్‌ అంతర్జాతీయ వేదిక నుంచి నవ్వులపాలయ్యారు. ఉజ్బెకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న షాంగై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీవో) సమ్మిట్‌ సందర్భంగా.. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే.. 

ఈ భేటీలో పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.  ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకునే క్రమంలో ఆయన పడ్డ అవస్థలు చూసి.. పుతిన్‌ చిన్నగా నవ్వుకున్నారు. ఎంతకీ అవి సెట్‌ కాకపోవడంతో.. ‘ఎవరైనా వచ్చి సాయం చేయండి’ అంటూ కోరారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది నుంచి ఒకరు వచ్చి సాయం చేశారు. ఆ సమయంలోనూ షెహ్‌బాజ్‌ ఇబ్బందిగా ఫీల్‌ కావడంతో.. పుతిన్‌ నవ్వుకుంటూనే ఉన్నారు. 

ఇక ఈ వీడియో వైరల్‌ కావడంతో.. పాక్‌లో ట్రోల్‌ నడుస్తోంది. బయటా తన చేష్టలతో పాక్‌ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు కొందరు. ఇంకొవైపు ప్రతిపక్ష పీటీఐ షీరిన్‌ మజారీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎస్సీవో సమ్మిట్‌లో పాక్‌ బృందం తీరును ప్రశ్నిస్తూ.. ట్విటర్‌లో ఎండగడుతున్నారు.

ఇదీ చదవండి: సేవింగ్స్‌ డబ్బులు ఇవ్వట్లేదని ఎంత పని చేసింది.. 

మరిన్ని వార్తలు