కీలక ప్రాంతాల విలీనం.. పుతిన్‌ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి

29 Sep, 2022 18:11 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్​ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్‌ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా.

ఈ మేరకు గ్రాండ్‌ క్రెమ్లిన్‌ ప్యాలెస్‌లోని జార్జియన్‌ హాల్‌లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సరిహద్దులు రష్యాలోని చేరనున్నాయి అని పుతిన్‌ వ్యక్తిగత ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిణామంపై అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ప్రసంగం చేస్తారని వెల్లడించారు. దీంతో పుతిన్‌ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. క్రెయిన్‌ సరిహద్దుల్లోని లుగన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్‌సన్‌, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్‌ నియమించిన రష్యన్‌ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు