రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్‌!

18 Jun, 2022 07:32 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఎదురు దాడుల కారణంగా భయానక యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఉక్రెయిన్‌కు వివిధ దేశాల నుంచి మద్దతు లభించడంతో రష్యాకు షాక్‌లు తగులుతున్నాయి.

తాజాగా.. నల్ల సముద్రంలో రష్యా నావికా దళానికి చెందిన కీలకమైన వాసిలీ బేఖ్‌ పడవపై దాడి చేశామని ఉక్రెయిన్‌ నేవీ శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. నల్లసముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌కు ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌తోపాటు జవాన్లను, అధునాతన ఆయుధాలను చేరవేసేందుకు రష్యా ఉపయోగిస్తున్న ఈ పడవపై దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. రష్యా యుద్ధనౌక మోస్క్‌వాను ఉక్రెయిన్‌ దళాలు స్నేక్‌ ఐలాండ్‌లోనే ధ్వంసం చేసినట్టు తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌ నేవీ ప్రకటనపై రష్యా మాత్రం స్పందించకపోవడం విశేషం. 

ఇదిలా ఉండగా.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా నుంచి కోకాకోలా పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కోకాకోలా, ఇతర బ్రాండ్ పానీయాలను ఇకపై రష్యాలో ఉత్పత్తి చేసి విక్రయించబోమని కంపెనీ ప్రకటించింది. దీంతో ఆర్థికంగా రష్యాకు తీవ్ర నష్టం ఏర్పడింది. మరోవైపు.. రష్యా మరోసారి యూరప్‌ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. 

ఇది కూడా చదవండి: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో హత్యకు ప్లాన్‌..

మరిన్ని వార్తలు