ఆ హ్యాండ్సమ్‌ సీరియల్‌ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. జైలులో ఉన్నా..

21 Jun, 2023 11:13 IST|Sakshi

రిచర్డ్‌ రెమిరెజ్‌ 1960 ఫిబ్రవరి 29న అమెరికాలోని టెక్సాస్‌ పరిధిలోగల ఎల్‌ పాసోలో జన్మించాడు. అతని బాల్యం సవ్యంగా సాగలేదు. అతని తల్లిదండ్రులు నిరంతరం గొడవపడుతూ అతనిని పట్టించుకునేవారు కాదు. 12 ఏళ్ల వయసులో రిచర్డ్‌ తన కజిన్‌ మైక్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏదో విషయమై భార్యతో గొడవ పడిన మైక్‌.. రిచర్డ్‌ ఎదుటనే ఆమెను హత్య చేశాడు.

ఈ ఉదంతం రిచర్డ్‌ మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే తాను కూడా ఎవరినైనా హత్యచేయాలని అనుకున్నాడు. తన బంధువు మైక్‌ తీరుతెన్నులకు ప్రభావితుడైన రిచర్డ్‌ పెరిగి పెద్దయ్యాక నేరమార్గాన్ని ఎంచుకున్నాడు. 1984 జూన్‌లో 79 ఏళ్ల వితంతువుపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు.

ఈ కేసులో పోలీసులు రిచర్డ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అది మెదలు రిచర్డ్‌ తన వినోదం కోసం హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆధారాలు మాయం చేయకుండానే రిచర్డ్‌  హత్యలు చేస్తూ వచ్చినా.. పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. దీంతో రిచర్డ్‌ నేరాల మీద నేరాలు చేస్తూ వచ్చాడు. 

ఈ నేపధ్యంలోనే అతను సైతానిక్‌ సొసైటీలో చేరాడు. ఈ సొసైటీ సైతానుకు పూజలు చేసేది. ఈ సొసైటీలో చేరిన దగ్గరి నుంచి ప్రతీరోజూ మత్తుమందులు తీసుకునేవాడు. ఫలితంగా నిస్సత్తువుగా మారి ఏ పనీ చేయలేకపోయేవాడు. మద్యం మత్తులో తేలేందుకే రిచర్డ్‌ ఈ సొసైటీలో చేరాడు. 

అయితే అంతకు మందు రిచర్డ్‌  13 హత్యలు, 11 అత్యాచారాలు, 14 దోపిడీలు చేశాడు. అక్కడి జనం అతనిని ‘నైట్‌ స్టాకర్‌’ అని పిలిచేవారు. పోలీసులు.. కొందరు బాధితులు అందించిన ఆధారాల మేరకు అతని స్కెచ్‌ రూపొందించారు. అతను మార్కెట్‌లో తిరుగుతుండగా వలపన్ని పోలీసులు అతనిని పట్టుకున్నారు. 

కోర్టు రిచర్డ్‌ రెమిరిజ్‌ను దోషిగా తీర్మానిస్తూ, 1989 నవంబరు 20న అతనికి ఉరిశిక్ష విధించింది. అతను చేసిన దారుణాలకు ‍ప్రతిగా అతనిని 19 సార్లు ఉరితీయాలని ఆదేశించింది.

రిచర్డ్‌ జైలులో మగ్గుతున్నప్పడు అతనికి అమ్మాయిల నుంచి లవ్‌ లెటర్లు వచ్చేవి. ఇదేకోవలో డోరిన్‌ లివోఎ అనే మ్యాగజైన్‌ ఎడిటర్‌ నుంచి కూడా అతనికి ఉత్తరాలు వచ్చేవి. ఆమె 11 ఏళ్లలో ఏకంగా 75కు మించిన ఉత్తరాలను రిచర్డ్‌కు రాసింది. ప్రతీవారం అతనిని కలుసుకునేందుకు జైలుకు వచ్చేది.

1996లో రిచర్డ్‌ జైలులోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వారి అనుబంధం ఎంతో కాలం నిలవలేదు. డెరిన్‌ అతనికి విడాకులు ఇచ్చింది. 2013 జూన్‌ 7న జైలులోనే రిచర్డ్‌  కన్నుమూశాడు. 

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు

మరిన్ని వార్తలు