Sydney: డెల్టా వేరియంట్ కలకలం రికార్డు స్థాయి కేసులు

6 Aug, 2021 14:47 IST|Sakshi

ఆస్ట్రేలియాలో  కోవిడ్-19  డెల్టా కేసులు

డెల్టా వేరియంట్: సిడ్నీలో రికార్డు స్థాయి కేసులు

సిడ్నీలో పరిస్థితి మరింత ఆందోళనకరం

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌  కేసుల ఉధృతి  తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్‌తో సిడ్ని నగరం విలవిలలాడుతోంది. ఆరు వారాల కఠిన లాక్‌డౌన్‌ తర్వాత కూడా రికార్డు స్థాయిల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అతిపెద్ద నగరం సిడ్నీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 291కి పెరిగింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత ధోరణి ప్రకారం  రోజువారీ కేసు సంఖ్య మరింత ఉధృతమయ్యే  ప్రమాదం ఉందని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ శుక్రవారం  ప్రకటించారు.

ఆస్ట్రేలియాలోని మూడు అతిపెద్ద నగరాలతో సహాఇతర ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఉత్తరాన ఉన్న క్వీన్స్‌ల్యాండ్‌, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా క్వీన్స్‌లాండ్‌లో10, మెల్‌బోర్న్‌లో విక్టోరియాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి.  సిడ్నీ, మెల్‌బోర్న్‌,  బ్నిస్బేన్‌ నగరాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగస్టు 28 వరకు సిడ్నీ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.  ఒక్క సిడ్నీ నగరంలోనే  దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు