ఎక్కడా దాక్కోలేదు.. కీవ్‌లోనేఉన్నా.. సోషల్‌ మీడియాలో లోకేషన్‌ షేర్‌ చేసిన జెల్‌న్‌స్కీ

8 Mar, 2022 11:15 IST|Sakshi

I'm Not Hiding, I'm Not Afraid Of Anyone: రష్యా ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం నేటికి 13వ రోజుకి చేరుకుంది. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్‌ బలగాలు కూడా సమర్థవంతంగా ప్రతిదాడి చేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ చాలా దారుణంగా అతలా కుతలమైనప్పటికీ మా దేశాన్ని, ప్రజల్ని కాపాడుకుంటాం అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తన దేశ భక్తిని చాటుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పారిపోయాడని, అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల వదంతులు వ్యాపించాయి.

దీంతో జెలెన్‌ స్కీ తాను ఇక్కడే ఉన్నా దేశం కోసం పోరాడుతున్నా అంటూ సెల్ఫీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ జెలెన్‌స్కీ తాజాగా ఒక వీడియోని పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో జెలెన్‌ స్కీ తన కార్యాలయంలోని డెస్క్‌ వద్ద కూర్చొని తన లోకేషన్‌ షేర్‌ చేస్తూ మాట్లాడారు. ఈ మేరకు జెలెన్‌ స్కీ వీడియోలో మాట్లాడుతూ..."నేను బంకోవా స్ట్రీట్‌లోని కైవ్‌లో  ఉన్నాను. నేను ఎక్కడ దాక్కోలేదు.  ఎవరికి భయపడను. మేమంతా పనిచేస్తున్నాము. రష్యాపై యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌ సాయుధ దళాలు చేసిన సేవలకు ధన్యవాదాలు. ఉక్రెయిన్‌ తప్పక విజయం సాధింస్తుంది" అనే తన నమ్మకాన్ని పునరుద్ఘాటించాడు.

A post shared by Володимир Зеленський (@zelenskiy_official)

(చదవండి: రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి)

మరిన్ని వార్తలు