వీలైనంత త్వరగా మన దేశం వచ్చేయండి: యూఎస్‌

29 Apr, 2021 13:53 IST|Sakshi

ఇండియాలో ఉంటున్న అమెరికన్‌ పౌరులకు సీడీసీ సూచన

వాషింగ్టన్‌: కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ భారతదేశంపై తన ప్రతాపాన్ని అధికంగా చూపిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో కరోనా వైరస్‌ గురించి పెద్దగా తెలియకపోయినా అందుబాటులో ఉన్న సమాచారంతోనే భారత్‌ ప్రభుత్వం కరోనాను ఎదుర్కుంది. అయితే ప్రస్తుతం సెకండ​ వేవ్‌ను మాత్రం అడ్డుకోలేకపోతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న కేసుల విపరీతంగా పెరుగుతుండడంతో పరిస్థితి నానాటికీ చేజారిపోతోంది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌ ప్రభుత్వం భారత్‌లో ఉన్న అమెరికన్లను హెచ్చరించింది.

భారత్‌ నుంచి త్వరగా వచ్చేయండి
అగ్రరాజ్యం అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఉండటం మంచిదికాదని.. ఇప్పటికే ఇండియాలో ఉన్నవారు వీలైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలని కోరింది. అలాగే భారత్‌కు వెళ్లకూడదని అమెరికన్‌ ప్రజలకు సూచించింది. అమెరికాకు ప్రతిరోజు భారత్‌ నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్‌ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటి ద్వారా దేశానికి  వెంటనే చేరుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ లెవల్‌ 4 ట్రావెల్‌ అడ్వైజరీలో పేర్కొంది. యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్ 4 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసింది. అమెరికన్‌ పౌరులు కొన్ని రోజుల వరకు భారత్‌కు వెళ్లకపోవడం మంచిదని సలహా ఇచ్చింది.

చదవండి: కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు

మరిన్ని వార్తలు