కొడుకు కోసం చెత్తని పోగుచేస్తే.. అదే అదృష్టంగా మారింది

8 Aug, 2021 12:53 IST|Sakshi

చెట్టంత కొడుకు పనీపాటా లేకుండా ఇంట్లోనే కూర్చొని తింటూంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? చీవాట్లు పెట్టి బుద్ది చెపుతారు. పని వెదుక్కొని ఇంటి అవసరాలకు చేదోడువాదోడు అవమని కోరతారు. కానీ సౌత్‌కొరియాలో.. ఓ తండ్రి మాత్రం అలాంటి బద్ధకిస్టు కొడుకు మీద నిరసనగా ఇంటి నిండా చెత్తను పోగు చేయటం ప్రారంభించాడు. అది కూడా దశాబ్దంపాటు. అలా పోగైన చెత్త  వాసనకు అతని భార్య అనారోగ్యం పాలయింది.

డాక్టర్ల సలహా మేరకు వెంటనే ఆ చెత్తను తొలగించాల్సిన పరిస్థతి వచ్చింది. అందులో భాగంగా ఆ చెత్తనంతా అమ్మితే  అతనికి రూ. 36 కోట్లు లభించాయి. అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్లు ‘కొడుకు కోసం చెత్తనే ఆస్తిగా పోగుచేసినట్లుందే’ అని బుగ్గలు నొక్కుకున్నారట.  నిజానికి ఆ తండ్రి అనుకున్నదొకటి.. అయినది ఇంకొకటి. ఇంట్లో చెత్తను పేర్చితే భరించలేక  కొడుకు బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటాడని ఆ తండ్రి ఆలోచన! ఏదైతేనేం పనిచేయని కొడుక్కి చెత్తతో ఆస్తిని సంపాదించి పెట్టాడు. ఇది దక్షిణకొరియాలో చోటు చేసుకుంది.     

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు