పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే

31 Oct, 2020 17:03 IST|Sakshi

కొంతమంది ఏదైనా కొత్తగా చేయాలని భావించి అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చకుంటారు. ముఖ్యంగా తిండి విషయంలో అలాంటివి చేసి తమ కడుపులు కూడా మార్చుకుంటారు. తాజాగా ఒక కొరియన్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. ఈ వీడియోలో కొరియన్‌ వ్యక్తి ఏం తయారు చేద్దామనుకున్నాడనేది తెలియదు. తన ముందు ఒక ఫౌంటేన్‌ జార్‌ను తీసుకొని అందులో చాక్లెట్‌ ఫ్లేవర్‌ను ఉంచాడు. ఆ తర్వాత కరిగి ఉన్న చీజ్‌(వెన్నముద్దను) తీసుకొని ఆ ఫౌంటేన్‌పై పెట్టాడు. (చదవండి : ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ)

ఫౌంటేన్‌ మిషన్‌ ఆన్‌ చేయగానే మొదట మాములూగానే చాక్లెట్‌ ఫ్లేవర్‌, చీజ్‌ కలిపి ఏదో వస్తున్నట్లు కనిపించింది. కానీ ఒక్కసారిగా మిషన్‌ వేగం అందుకోవడంతో చీజ్‌ గిరాగిరా తిరుగుతూ అతని ముఖంపై చిట్లింది.  దీంతో తాను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యిందని బాధపడ్డాడు. ఇక చేసేదేంలేక కిందపడిన చీజ్‌ను తీసుకొని పక్కనే ఉన్న రోల్స్‌‌లో నుంచుకొని తినాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పిచ్చి ప్రయోగాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 6 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు