చుక్కేసి.. హోర్డింగ్‌ ఎక్కేసి.. పైన పక్కేసి.. గురక పెట్టేసి..

6 Nov, 2023 13:26 IST|Sakshi
కంఠేశ్వర్‌ ప్రాంతంలో హోర్డింగ్‌ ఎక్కి నిద్రపోయిన రవీందర్‌

తాగిన మైకంలో హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు..

కిందికి దింపిన స్థానికులు, పోలీసులు!

సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: తాగిన మైకంలో హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు అక్కడే నిద్రపోయిన ఘటన నిజామాబాద్‌ నగరంలోని కంఠేశ్వర్‌ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతానికి చెందిన మేస్త్రీ పని చేసే రవీందర్‌ అలియాస్‌ రవి ఆదివారం మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుని అక్కడే ఉన్న హోర్డింగ్‌ ఎక్కి నిద్రపోయాడు. హోర్డింగ్‌పై రవీందర్‌ను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్‌ పోలీసులు, మూడో టౌన్‌ పోలీసులు చేరుకున్నారు. వారి సూచన మేరకు స్థానికులు హోర్డింగ్‌ ఎక్కి రవీందర్‌ను కిందికి దింపారు.
ఇవి చదవండి: 'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్!

మరిన్ని వార్తలు