పత్తి ఉత్పత్తిలో సంతృప్తి | Sakshi
Sakshi News home page

పత్తి ఉత్పత్తిలో సంతృప్తి

Published Mon, Nov 6 2023 12:34 AM

లివిరిలో సాగుతున్న పత్తి పంట  - Sakshi

● మద్దతు ధర ప్రకటనతో రైతుల్లో ఆనందం ● పార్వతీపురం మన్యం జిల్లాలో 16 వేల ఎకరాల్లో సాగు ● సరాసరిగా ఎకరాకు 6 క్వింటాళ్ల పంట దిగుబడి

భామిని: తెల్లబంగారంగా పిలిచే పత్తి పంట రైతుకు కొంగుబంగారంగా మారుతోంది. వాణిజ్య పంటలలో ప్రధాన లాభదాయక పంటగా కాటన్‌ ఉంది. సంప్రదాయ పంటలు గిట్టుబాటు కాకపోవడంతో నష్టాల నుంచి బయట పడడానికి రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్టు భూములతో పాటు, పల్లం భూముల్లోనూ పత్తి సాగు విస్తరించింది. కొండకోనల్లోనూ, పోడు సాగులోనూ పత్తి పంట ప్రవేశించింది.ఆదివాసీ గిరిజనుల సైతం ప్రధాన పంటగా పత్తిని సాగుచేస్తున్నారు.

ఈ–క్రాప్‌లో పత్తి పంట నమోదైన విస్తీర్ణాన్ని సుమారు 13వేలఎకరాలుగా అధికారులు గుర్తించారు. వాస్తవంగా సాగు విస్తీర్ణం 16 వేల ఎకరాల వరకు ఉండవచ్చు. పూర్తి స్థాయి కౌలు, ప్రభుత్వ, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో సాగుతున్న పత్తి పంట లెక్కల్లోకి రాలేదని రైతులు చెబుతున్నారు. కొండ, మెట్టప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో చేస్తున్న సాగు నమోదు కావడం లేదని అంటున్నారు.

అనుకూలంగా మద్దతు ధర..

ఈ ఏడాది ప్రభుత్వం పతి క్వింటాకు మద్దతు ధరను రూ.7,020గా ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో కూడా ధర పెరిగింది. సాధారణ మార్కెట్‌లో రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలుకుతోంది. దీంతో పత్తి సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఆర్థిక సహయం అందడం, ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, మందులు, విత్తనాలు అందజేస్తుండడంతో పత్తి సాగుపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

వరుస వర్షాలతో..

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ముడి పత్తి దిగుబడి తగ్గనుందని వ్యవసాయాదికారులు అంచనా. గతంలో ఎకరాకి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కీలకమైన అక్టోబర్‌ నెలలో వానల జాడ లేకపోవడంతో పంట దిగుబడి తగ్గనుంది. అయితే ఇప్పుడిప్పుడే పత్తి సేకరణ వేగం పుంజుకుంది. ఎకరాకి 5 నుంచి 6 క్వింటాళ్లకు దిగుబడి పడిపోవచ్చని రైతులు భావిస్తున్నారు. సరాసరిగా 6 క్వింటాళ్ల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాలూరు, రాజాంలలో కొనుగోలు కేంద్రాలు

జిల్లాలోని సాలూరు, సరిహద్దులోని రాజాంలో ఐీసీసీ పత్తి కొనుగోలు కేంద్రాలున్నాయి. రామభద్రపురంలో జిన్నింగ్‌ మిల్లు ఉంది, ప్రభుత్వం మద్దతు ధర పెంచడం, మార్కెట్‌లోనూ గిట్టుబాటు ధర పలుకుతుండడంతో పత్తి ఉత్పత్తి తగ్గనున్నప్పటికీ రైతుకు ధర అనుకూలంగా ఉంది. ప్రైవేట్‌ మార్కెట్‌లోనూ యథేచ్ఛగా పత్తిని అమ్ముకోవడానికి రైతుకు స్వేచ్ఛ ఉంది.

రాబర్ట్‌ పాల్‌. జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు,

పొలంలో సేకరించిన ముడి పత్తి బస్తాలు
1/4

పొలంలో సేకరించిన ముడి పత్తి బస్తాలు

ముడి పత్తిని ఆరబెడుతున్న రైతు కుటుంబం
2/4

ముడి పత్తిని ఆరబెడుతున్న రైతు కుటుంబం

3/4

4/4

Advertisement
Advertisement