బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు

12 Nov, 2023 01:24 IST|Sakshi

కరీంనగర్‌: విభజన హామీలు అమలు చేయకుండా తెలంగా ణ విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించా రు. విభజన హామీ ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, ఐఐఎం, సైనిక్‌ స్కూల్స్‌, కరీంనగర్‌లో ఐఐఐ టీ ఏర్పాటు లేదని, సైన్స్‌ సెంటర్‌ పనుల ముందడుగు లేదని మండిపడ్డా రు. గత పదేళ్లుగా బీజేపీ, మోడీ ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూ స్తోందని, రాష్ట్ర బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒక్కనాడు కూడా విభజన హామీలపై, తెలంగాణ సమస్యలపై మాట్లాడింది లేదన్నారు. ఎంపీ బండి సంజయ్‌, ఇతర ఎంపీలు యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడం తప్ప యువతకు చేసింది ఏమీ లేదన్నారు.

బార్‌ నిర్వాహకులపై కేసు

కరీంనగర్‌క్రైం: నిబంధనలు పాటించని బార్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. నగరంలోని ప్రధాన కూరగాయాల మార్కెట్‌ సమీపంలో ఉన్న కల్పన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ శనివా రం ఉదయం 10గంటల కన్నా ముందే తెరిచి మద్యం అమ్మకాలు జరిపారు. నిబంధనలు అతిక్రమించారని బ్లూ కోల్ట్స్‌ కానిస్టేబుల్‌ వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బార్‌ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

II

మరిన్ని వార్తలు