నా కొడుకుది ప్ర‌మాదం కాదు, కావాల‌నే ఇలా చేశారు!

7 Dec, 2023 10:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్‌ మండలంలోని నామాపూర్‌కు చెందిన ఇంటర్మీడియెట్‌ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు. నామాపూర్‌కు చెందిన మంగళి అక్షయ్‌(17) సోమవారం చీకోడు నుంచి స్నేహితుడితో కలిసి నామాపూర్‌ వైపు వస్తుండగా వాహనంపై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అక్షయ్‌ను సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

ముస్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న అక్షయ్‌ మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు శమంత, దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కాగానొక్క కొడుకు మృతితో తాము దిక్కులేని వారమయ్యామని వారు రోదించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు