ముగిసిన రాష్ట్రస్థాయి జూడో పోటీలు

7 Dec, 2023 00:06 IST|Sakshi
బహుమతులు ప్రదానం చేస్తున్న అధికారులు

సుల్తానాబాద్‌: పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో రెండ్రోజులుగా సుల్తానాబాద్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరుగుతున్న ఎనిమిదో రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో చాంపియన్‌గా వరంగల్‌ జిల్లా నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు నిలవగా కరీంనగర్‌ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌ రెడ్డి హాజరై విజేతలకు ట్రోఫీలతో పాటు బంగారు, రజత, కాంస్య పతకాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో జిల్లాలో జూడో క్రీడకు గ్రామాల్లో ఆదరణ రానుందన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన 18 మంది బాలబాలికలను కేరళలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసామన్నారు. కార్యక్రమంలో భారత జూడో సమాఖ్య కోశాధికారి కై లాసం యాదవ్‌, సుల్తానాబాద్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎం. రవీందర్‌, జిల్లా జూడో సంఘం చైర్మన్‌ మిట్టపల్లి ప్రవీణ్‌ కుమార్‌, అధ్యక్షుడు మాటేటి సంజీవ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి సిలివేరి మహేందర్‌, జిల్లా పెటా సంగం కార్యదర్శి వేల్పుల సురేందర్‌, సాయిరి మహేందర్‌, అంతటి శంకరయ్య, దాసరి రమేశ్‌, బిట్ర శ్రీనివాస్‌, ఎండీ యూనిస్‌ పాషా, బైరగోని రవీందర్‌ గౌడ్‌, కుమార్‌ కిషోర్‌, బాలసాని రాజ్‌కుమార్‌ గౌడ్‌, అంతర్జాతీయ ఖో ఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్‌ యాదవ్‌, ఇక్బాల్‌, శివ, సత్యనారాయణ వివిధ జిల్లాల నుంచి హాజరైన కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు