Amitabh Bachchan: రెండో డోసు తీసుకున్న బిగ్‌బీ

16 May, 2021 16:23 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకి లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

కాగా, అమితాబ్‌ ఆ మధ్య కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన పాజిటివ్‌ నిర్థారణ కావడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన  ‘మేడే’, ‘గుడ్​బై’చిత్రాల్లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్‌ నిలిచిపోయింది. 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు