జోరు పెంచిన ఎన్టీఆర్‌.. ఇక వరుస సినిమాలతో సందడి

12 Sep, 2021 20:16 IST|Sakshi

మూడేళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు తారక్.ఇప్పుడు ఈ సినిమా పూర్తైంది.సరైన సమయంలో మూవీ రిలీజ్ కానుందని యూనిట్ ప్రకటింది.చరణ్ ఇప్పటికే శంకర్ మేకింగ్ లో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.మరి టైగర్ సంగతి ఏంటి? కొరటాల తో సినిమా ఎప్పుడు?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తైంది. దీంతో రామ్‌ చరణ్‌తో పాటు ఎన్టీఆర్‌ కూడా ఫ్రీ అయిపోయాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి కొరటాల మేకింగ్ లో ప్యాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఈ సినిమాలో టైగర్ స్టూడెంట్ లీడర్గా నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోయిన్ గా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది.కొరటాలతో మూవీ తర్వాత చాలా మంది దర్శకులను లైన్ లో పెట్టాడు తారక్‌. ఇప్పటికే కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు.  అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఇదే సిరీస్ లో తమిళ దర్శకుడు వెట్రీమారన్ మేకింగ్ లోనూ నటించబోతున్నాడట. ఈ మూవీతో కోలీవుడ్ మార్కెట్ ను సీరియస్ గా టార్గెట్ చేయబోతున్నాడు జూనియర్. వడా చెన్నై, అసురన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రీమారన్. ప్రస్తుతం సూర్యతో వాడివసల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత  తారక్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు