కీర్తి సురేష్‌ ఎవరితోనూ ప్రేమలో లేదు..

18 Feb, 2021 08:42 IST|Sakshi

‘వై దిస్‌ కొలవెరి’ అనుకుంటున్నారట అనిరుద్‌ రవిచంద్రన్‌. చంపాలనుకునేంత కచ్చి ఎందుకు? అనేది అర్థం. ధనుష్, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన ‘త్రీ’ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్‌ స్వరపరచిన ఈ పాట చాలా పాపులర్‌. ఇప్పుడు అనిరుద్‌కి కూడా చాలామంది మీద చంపాలనేంత కాకపోయినా కచ్చిగా మాత్రం ఉందట. దానికి కారణం కీర్తీ సురేశ్‌కి, అతనికి పెళ్లి అని వార్త రావడమే! ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియాలో వార్త గుప్పుమంది.

ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలతో వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ వార్త నిజమేనా? అని కీర్తీ సురేశ్‌ తల్లి, నటి మేనకను సంప్రదించగా, ‘ఆల్రెడీ మలయాళ మీడియాతో ఈ విషయం గురించి కీర్తి తండ్రి స్పష్టం చేశారు’ అన్నారామె. ‘ఇది వదంతి. ఏ మాత్రం నిజం లేదు’ అని కీర్తి తండ్రి సురేశ్‌ పేర్కొన్నారు. ‘కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే’ అని కూడా అక్కడి మీడియాతో సురేశ్‌ అన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన ‘సర్కారువారి పాట’, రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు కీర్తీ సురేశ్‌.
చదవండి: కీర్తి సురేశ్‌ కన్నా నేను అందంగా ఉన్నానట!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు