-
ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!
బుల్లితెరలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే షోలో టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. దీంతో తన కామెడీ టైమింగ్ పంచ్‌లతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్‌పైనా కూడా పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్యే విడుదలైన ధనుష్ 'సార్' సినిమాలో కూడా ఆది మెప్పించాడు. (ఇదీ చదవండి: TFCC Election Live Update: టాలీవుడ్ లో ఉత్కంఠ.. గెలుపెవరిది?) తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్‌తో ఆది ప్రేమలో ఉన్నారట. ఆమెతో ఆదికి చాలా కాలం నుంచే పరిచయం ఉందట. ఒక రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అతనికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట. అలా స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమ వరకు వచ్చిందట. (ఇదీ చదవండి: TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి) తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట. -
పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!
నటి కీర్తీసురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నటి ఈ బ్యూటీ. తల్లి మేనక నటి. తండ్రి సురేశ్ నిర్మాత. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన కీర్తీ ఆ తరువాత ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికేయన్‌తో నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కీర్తీసురేశ్‌కు నటిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తెలుగులో మహానటి చిత్రంతో సావిత్రిగా జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే గెలుచుకుంది. కీర్తీ సురేశ్ ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. జయంరవితో నటిస్తున్న సైరన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటి కీర్తీసురేశ్ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు సంబంధం చూశారు అనీ రకరకాల ప్రచారం వైరల్ అవుతోంది. ఇది ఒక రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీనే అవుతోందని చెప్పవచ్చు. కాగా ఈ భామ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్ అధికమే. ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని అడగ్గా నటుడు వడివేలు రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏముందీ? ఏమీలేదు అనే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ చేసి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు అని తేల్చి చెప్పింది. -
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యంగ్ హీరో!
యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిలింలో నటించి.. దర్శకుల దృష్టిని ఆకర్షించిన అతడు ‘ఉయ్యాల జంపాల’ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21F’తో వరుస హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో అదే జోరును కొనసాగించలేకపోయాడు. క్రమంగా సినిమాలు తగ్గించి ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావించి ‘పవర్ ప్లే’, ‘ఓరేయ్ బుజ్జి’ సినిమాలు చేశాడు. పవర్ ప్లే మూవీ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలైన ఓరేయ్ బుజ్జి కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్య యువ హీరోలంతా వరుసగా పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వారందరి బాటలో తాజాగా రాజ్ తరుణ్ కూడా అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల హైదరాబాద్‌లో సొంత ఇంటిని కొనుగొలు చేసిన రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. దానికి తగ్గట్లు అతడు త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో రాజ్ తరుణ్ విజయవాడకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో ఈ కుర్ర హీరో ఏడడుగులు వేయనున్నాడేమోనని అందరు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇందులో ఎంతవరకు నిజమో తెలియాలంటే అతడు స్పందించే వరకు వేచి చూడాల్సింది. కాగా గతంలో కూడా రాజ్ తరుణ్ ఓ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఈ యంగ్ హీరో కొట్టిపారేశాడు. చదవండి: NTR 30: మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్! సమంత గుడ్‌న్యూస్ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం! -
హైపర్ ఆది పెళ్లి ఆరోజే.. ఆమెనే పెళ్లాడతాడట!
కామెడీ టీమ్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. తాజాగా అతడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి హైపర్ ఆది.. ముందు సుధీర్, రష్మిల పెళ్లి అయిన తర్వాతే తాను పెళ్లిపీటలెక్కుతానని గతంలో పలుమార్లు మీడియాతో చెప్పాడు. కానీ వాళ్లు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో తనే ముందు వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆది కోసం పెళ్లికూతురును వెతికే పనిలో పడ్డారట అతడి ఇంటి సభ్యులు. అతను కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చే అమ్మాయినే అర్ధాంగిగా చేసుకుంటానని చెప్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పెళ్లి డేట్ కూడా ప్రకటించేశాడట హైపర్ ఆది. వచ్చే ఏడాది తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని అంటున్నాడట. అది కూడా తన సొంత జిల్లా ప్రకాశానికి చెందిన అమ్మాయితోనే ఏడడుగులు నడుస్తానని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో త్వరలోనే తెలియనుంది. చదవండి: స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి! నటుడి కొడుకు కోసం చిరంజీవి ఖరీదైన గోల్డ్ చైన్!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్‌షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్‌కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement