ఐటెం గర్ల్‌ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్‌

17 May, 2021 16:35 IST|Sakshi

ముంబై : రాఖీ సావంత్‌.. బిగ్‌బాస్‌ సీజన్‌ 14లో మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బోల్డ్‌నెస్‌తో పాటు కాంట్రవర్సీ క్వీన్‌గానూ పేరొందిన రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో తనకు ఐటెం గర్ల్‌ అన్న గుర్తింపు రావడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్‌ లేవని, అయినా తనకు హీరోయిన్‌ పాత్ర పోషించేంత టాలెంట్‌ కూడా లేదని తెలిపింది. 'బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరూ హీరోయిన్‌ కాలేరు. కొందరికి ఐటెమ్‌ గర్ల్‌లాగా ఛాన్సులొస్తే.. మరికొందరికేమో తల్లి, చెల్లి, ఫ్రెండ్‌, నెగిటివ్‌ రోల్స్‌ లేదా చిన్న చిన్న పాత్రలు వస్తాయి.

అయినా కెరీర్‌లో ఐటెం సాంగ్స్‌ చేయడం పట్ల నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే అలా సంపాదిచిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంతేకాకుండా ఐటెం గర్ల్‌గా బాలీవుడ్‌లో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను' అని వెల్లడించింది. మొహబత్‌ హై మిర్చి, దేక్తా హై తు క్యా వంటి స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ తన దూకుడుతో మరింత గుర్తింపు సంపాదించుకుంది. నాచ్‌ బలియే, పతి పత్ని జౌర్‌ వో, బిగ్‌బాస్‌ వంటి రియాలిటీ షోస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. 

చదవండి : అత్యాచారం చేయబోయారు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌
పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు