ఆస్పత్రి నుంచి సాయిధరమ్‌ తేజ్‌ డిశ్చార్జ్‌ 

17 Oct, 2021 04:13 IST|Sakshi

ఇది పునర్జన్మ అంటూ సినీ హీరో చిరంజీవి ట్వీట్‌ 

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): గత నెల 10న రోడ్డు ప్రమాదానికి గురై 35 రోజుల పాటు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన హీరో సాయిధరమ్‌తేజ్‌ శుక్రవారం పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ‘ఇది నీకు పునర్జన్మ. ఈ దసరా పండుగకు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం అద్భుతం.

సాయిధరమ్‌తేజ్‌ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు’అంటూ మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. గత నెల 10వ తేదీన దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై బైక్‌ స్కిడ్‌ కావడంతో సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదానికి గురికాగా...ఆస్పత్రిలో ఆయనకు కాలర్‌ బోన్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు