-
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్‌లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఓటీటీలో అదరగొడుతున్న మ్యాడ్.. బ్లాక్‌బస్టర్ జవాన్‌ను వెనక్కు నెట్టేసింది!
వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఓ పాన్ ఇండియా సినిమాకు ఓ చిన్న సినిమా గట్టి పోటీనిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో దక్షిణాది తారలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీయే. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2న రిలీజ్ అయింది. అప్పుడే ఓటీటీ రిలీజైన మ్యాడ్ ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ సినిమా నిత్యం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్‌లో చోటు దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఝలక్ ఇస్తోంది చిన్న చిత్రం మ్యాడ్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపీక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో హిట్ అయిన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అటు జవాన్, ఇటు మ్యాడ్‌ను ఓటీటీ ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. టాప్ 10 చిత్రాల్లో మ్యాడ్ ఏ స్థానంలో ఉందంటే? ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువమంది చూస్తున్న టాప్ 10 చిత్రాల్లో జవాన్ హిందీ వర్షన్ తొలి స్థానంలో నిలబడి తన ఆధిక్యతను చాటుకుంటోంది. కానీ తమిళ, తెలుగు వర్షన్లను మాత్రం మ్యాడ్ మూవీ వెనక్కు నెట్టేసింది. ఎక్కువమంది చూస్తున్న సినిమాల్లో మ్యాడ్ రెండో స్థానంలో నిలబడింది. జవాన్ తమిళ వర్షన్ మూడో స్థానంలో, తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో నిలిచాయి డ్రీమ్ గర్ల్ 2.. ఐదో స్థానంలో ఉంది. చంద్రముఖి 2 పదో స్థానంలో ఊగిసలాడుతోంది. ఇది ఆదివారం నాటి లెక్కలు.. ఇది చూసిన అభిమానులు ఒక చిన్న తెలుగు సినిమా.. భారీ బడ్జెట్ మూవీ జవాన్‌కు గట్టి పోటీనే ఇస్తుందే అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన మెగా ఇంటి కోడలు.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా? -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్‌స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్! -
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
కేరళలో విజృంభిస్తున్న వెస్ట్ నైలు జ్వరం కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
రాయల్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement